గత వేసవిలో అర్చకుల జీతాన్ని పెంచిన ఏపీ సర్కార్ మరోసారి వారి జీతాన్ని 25 శాతానికి పెంచుతూ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. సీఎం నిర్ణయం పట్ల ఆలయాల అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అర్చకుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు.
కేటగిరి-1 దేవస్థానాల్లో పని చేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా..కేటగిరీ-2 దేవస్థానాల్లో పని చేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.