బాపట్లలో పుట్టిన నాకు బూతులు రావా..జనసేనాని ఫైర్

Pawan Kalyan fires on YCP leaders

0
87

బాపట్లలో పుట్టిన నాకు బూతులు రావా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని, నేర్పిస్తానని అన్నారు. వైసీపీ గ్రామ సింహాలు అనే మాటలు అని కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి మరీ కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఎవరిని మరచిపోను, గుర్తుపెట్టుకుంటా. నన్నెంత తిడితే అంత బలపడతా..ఎవర్ని ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు. నేను ఎటువంటి యుద్దానికి అయిన సిద్దమే అని అన్నారు. నా జీవితం బ్లాక్ అండ్ వైట్. నేను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదు కానీ ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కొద్ది రోజులుగా పోసానికి, పవన్ కళ్యాణ్ కు మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.