పీఈటీ అభ్యర్థుల ముట్టడితో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులంతా బస్సులో వచ్చి అసెంబ్లీ వద్దకు వచ్చి ఒక్కసారిగా ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- Advertisement -
అయితే పీఈటీ అభ్యర్థులు మాత్రం..గురుకుల పీఈటీలో 1:1 ఫలితాల జాబితాను ప్రకటించాలని, పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. మాకు పోస్టింగ్ అయినా ఇవ్వండి లేదా కారుణ్య మరణాల కింద అయిన అనుమతి ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.