Breaking News: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

0
112

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లాలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు-డంపరును ఢీకొంది.

ఈ  ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గోహడ్ స్క్వేర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అధికారులు, స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.