Fake News-టాటా చేతికి ఎయిర్ ఇండియా..వాస్తవం కాదు

0
81

న్యూఢిల్లీ: దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేసిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఎయిరిండియా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణలో ఆర్థిక బిడ్లను ప్ర‌భుత్వం ఆమోదించింద‌న్న మీడియా వార్త‌ల్లో నిజం లేదని ఆర్థిక శాఖ ఒక ట్వీట్‌లో వెల్ల‌డించింది. దీనిపై నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు ప్ర‌భుత్వం..మీడియాకు వెల్ల‌డిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.