Flash- సీజేఐ జస్టిస్‌ రమణ తీవ్ర ఆగ్రహం

CJI Justice Ramana is furious

0
87

ఢిల్లీ అధికారులు, పోలీసు వ్యవస్థ పని తీరుపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ కూడా రక్షించలేదని వ్యాఖ్యానించారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఏడీజీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు సీజేల నేతృత్వంలో స్థాయి సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రస్తుతానికి స్థాయి సంఘంపై ఉత్తర్వులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.