Flash: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పుష్ప విడుదల ఎప్పుడంటే?

Good news for Bunny fans

0
100

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ మూవీ పుష్ప. ఈ మూవీ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పుష్పరాజ్ లుక్ అదిరిపోగా..’దాక్కో దాక్కో మేక’ సాంగ్ మిలియన్స్ వ్యూస్ క్లూబ్ లో చేరిపోయింది. ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ, సుక్కు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.