నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనే..చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

As an actor I was born in Rajahmundry

0
115

నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనే అని, రాజమండ్రితో నాకు విడదీయరాని బంధం ఉందని కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం వై-జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల వ్యవస్థాపకులు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు.

ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అల్లు రామలింగయ్య కళాశాల ఆవరణలో రూ.2 కోట్ల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నా మొదటి మూడు సినిమాలు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయన్నారు. నాది అల్లు రామలింగయ్యది గురు – – శిష్యుల సంబంధం వంటి దన్నారు. బిజీగా ఘాటింగ్ లో ఉండడం వలన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదని అన్నారు.

అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హెూమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని గుర్తు చేసుకున్నారు. ఇవాల్టికీ మా ఫ్యామిలీ హెూమియోపతి మందులే వాడతామని, హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని అన్నారు. సంజీవని లాంటి హెూమియోపతి వైద్యమని కొనియాడారు. హెూమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, హెూమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య స్పూర్తి ప్రదాత అని అన్నారు. తన చిన్నతనంలో హోమియో పతిని ఉమాపతిగా పలికేవాడ్ని చిన్న నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. మనఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలోనే నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు.

అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. వానాకాల చదువులు చదివిన రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన అనుకుంటే ఏదైనా సాధించేవారని వివరించారు. నిత్యవిద్యార్ధిగా అల్లు వుండేవారని తెలిపారు. హోమియో పతి వైద్యం అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్య నయం చేసేవారని అన్నారు.

కాలేజీ భవనానికి నిధులు కేటాయించినది నా డబ్బులు కాదని చిరు అన్నారు. నా రాజ్యసభ నిధుల నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చానంతే వివరించారు. మెగా స్టార్ చిరంజీవి గా రాజమహేంద్రవరం (మధురపూడి) ఎయిర్పోర్టులో దిగిన చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, అల్లు అరవింద్, ఆయన బావ డాక్టర్ వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపాల్ టి.సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు.