విజయ్ దేవరకొండతో కొరటాల మూవీ

విజయ్ దేవరకొండతో కొరటాల మూవీ

0
95

కొరటాల శివ తదుపరి సినిమా చిరంజీవితో వుంది. నవంబర్ నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కొరటాలతో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పాడు.

విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పడం వలన, ఈ వార్తను ఇక కొట్టి పారేయడానికి లేదు. అయితే చిరంజీవితో సినిమా చేశాక, ఎన్టీఆర్ తో కొరటాల సినిమా ఉండొచ్చుననే వార్తలు ఈ మధ్య వినిపించాయి. ఎన్టీఆర్ తో కొరటాలకి మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఉండొచ్చునని అనుకున్నారు. అయితే చిరూ ప్రాజెక్టు తరువాత కొరటాల అటు ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడా? లేదంటే ముందుగా విజయ్ దేవరకొండకి యాక్షన్ చెబుతాడా? అనేది చూడాలి.