ఏడుపుతో బోలెడు లాభాలు..కన్నీళ్లతో కలిగే ప్రయోజనాలివే!

Lots of benefits with crying

0
81

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నాడు కవి ఆత్రేయ. ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినా వెంటనే మనకు కళ్ళలోంచి నీళ్లు వస్తుంటాయి. అయితే బాధతో వచ్చే కన్నీళ్లనే ఏడుపు అనడం పరిపాటి. ఏడుపంటే బాధకు చిహ్నం అనుకుంటాం కానీ, ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

టెక్నాలజీ ఎంత వేగంగా అభివద్ధి చెందుతుందో మనిషి కూడా అంతేవేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో ఉరుకులు పరుగుల జీవనంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మనం దేని గురించైనా బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి.

ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

కళ్ల నుంచి నీరు కారడం వల్ల  కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకుపోగొట్టడంలో తోడ్పడతాయి.

కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతో పాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి సారిస్తారు. కాబట్టి ఎప్పుడూ నవ్వకుండా అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండండి.