రేవ్‌పార్టీపై ఎన్‌సీబీ అధికారిక ప్రకటన..ఆర్యన్ తో సహా 8 మంది అరెస్ట్

NCB official statement on rave party, 8 arrested, including Aryan

0
119

ముంబయిలో రేవ్‌ పార్టీకి సంబంధించి ఎనిమిది మందిని ప్రశ్నిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారికంగా ప్రకటించింది. ఇందులో స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌, దమేచాను, సారిక, ఇస్మీత్‌ సింగ్‌, జస్వాల్‌, విక్రాంత్‌, గోమిత్‌ చోప్రా ఉన్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.

ముంబయి మీదుగా గోవా వెళ్తున్న క్రూయిజ్‌ నౌకలో జరుగుతున్న రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమచారంతో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌ పార్టీలో బాలీవుడ్‌ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.