Flash News: సింగూర్ ప్రాజెక్టు వద్ద విషాదం..ఒకరు మృతి

0
90

తెలంగాణ: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. సింగూర్ ప్రాజెక్టు దిగువన సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో ఇద్దరు యువకులు పడిపోయారు. అక్కడే వున్న స్థానికులు ఇద్దరిలో ఒకరిని తాడు సహాయంతో రక్షించగా..హైద్రాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. రక్షించిన యువకుడు సదాశివపేటకు చెందిన వాడిగా గుర్తించారు. కాగా యువకులను రక్షించేందుకు ప్రాజెక్టు గెట్స్ ను ప్రాజెక్ట్ అధికారులు మూసేశారు.