హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం..ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్‌లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినే వారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిప్రాయపడ్డారు.