తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలుగా నిధులను డ్రా చేశారన్నారు.
అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ వెల్లడించారు. ఈ కుంభకోణంలో సాయికుమార్ కీలక నిందితుడు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేశారని పోలీసులు తెలిపారు.
రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ తెలిపారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన 324 కోట్లు కొట్టేయాలని స్కేచ్ వేసినట్లు తెలిపారు. కమీషన్లు ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలిపారు.
వీరిలో A1 ముద్దాయిగా మస్తాన్ వలీ, A2 సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8 వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు.