ప్రాణాపాయ స్థితిలో అభిమాని..వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్

0
94

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు హీరో జూనియర్​ ఎన్టీఆర్​. స్వయంగా వీడియో కాల్​ చేసి..ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ..జూనియర్​ ఎన్టీఆర్​కు వీరాభిమాని. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బ తినడం వల్ల విజయవాడలోని రమేశ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి తన చివరి కోరికగా..జూనియర్​ ఎన్టీఆర్​ను కలవాలని వైద్యులకు చీటి రాసి చూపించాడు. ఆ విషయాన్ని వైద్యులు మురళీ బంధువులకు చెప్పారు. వెంటనే వారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్​ అభిమాన సంఘానికి మురళీ చివరి కోరికను తెలియజేశారు.

తన అభిమాన సంఘం సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జూనియర్​ ఎన్టీఆర్​.. వెంటనే మురళీకి వీడియో కాల్​ చేశారు. తనను ఎంతగానే ప్రేమిస్తున్న తన అభిమానికి ఇలా జరగడం తనను కలచివేసిందని చెప్పారు. మురళీ కోసం వీడియో కాల్​ చేసి ధైర్యం చెప్పిన జూనియర్​ ఎన్టీఆర్​కు.. ఆయన బంధువులు ధన్యవాదాలు తెలిపారు. యంగ్​ టైగర్​పై ప్రశంసలు కురిపించారు.