నాగచైతన్య, సమంత విడిపోయినప్పటి నుండి సమంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎఫైర్ అని కొందరు, సినిమాల కోసమని మరి కొందరు ఇలా ఏవేవో కారణాలతో సమంతని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. మాధవీలత, ఖుష్బూ, వెంకటేష్ ఇలా చాలా మంది నెటిజన్లు చేసే విమర్శలకు ధీటుగా ట్వీట్ చేశారు.
సమంత తాజాగా తన మనసులోని బాధను చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మహిళలను ప్రశ్నిస్తూ ఉండే సమాజం, మగళవాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అని గుడ్ మార్నింగ్ చెబుతూ కొటేషన్ పెట్టింది. చైతూ నుండి దూరమయ్యాక సమంత లోలోపల చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది సమంత. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం.