Breaking News- ఆఫ్గనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి

0
91

ఆఫ్గనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్ధనల కోసం వేలాది మంది ముస్లింలు కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదుకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అదే మసీదులో ఈ దుర్ఘటన జరిగింది. కాగా తాలిబన్ల చేతికి ఆఫ్ఘన్ వెళ్లిన తర్వాత ఇది రెండో ఆత్మాహుతి దాడి కాగా ఆత్మాహుతి దాడిలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఒక్కక్షణం ఏం జరిగిందో తెలియక జనం పరుగులు తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మసీదులో రోజూ ప్రార్థనలు చేసేందుకు వందల మంది వెళ్తుంటారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనిపై తాలిబన్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన అనేక మంది విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.