రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్..

0
107

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమా రూపొందింది. యాక్షన్..ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాతో ఈ కథ నడవనుంది. సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి బాలు పాడిన పాటను ఫస్టు సింగిల్ గా వదిలారు. ఆ పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో శనివారం సాయంత్రం 6 గంటలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ – శ్రేయా ఘోషల్ ఆలపించగా, రజనీ … నయనతారపై చిత్రీకరించారు.

ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జాకీ ష్రాఫ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించారు. వివిధ భాషల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.