ప్రియకు బిగ్‌బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కలిసొచ్చింది. అయిదో వారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ఆమె విజయం సాధించి, కొత్త కెప్టెన్ అయ్యారు. తాము ఎంతో కష్టపడి ఆడామని అయినా, ప్రయోజనం లేకుండా పోయిందని సన్నీ, మానస్‌లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కొత్త కెప్టెన్ ప్రియకు రవి సలహాదారుడు అయ్యాడు. ఎవరెవరికి ఏయే పనులు చెప్పాలో వివరించాడు.
ఈ వారం బెస్ట్- వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్ ఇంటి సభ్యులకు సూచించాడు. నెక్‌లాక్‌లో వాళ్లను బంధించి ముఖంపై నీళ్లు కొట్టాలని ఆదేశించాడు. దీంతో అత్యధికమంది కాజల్‌ను వరెస్ట్ ఫెర్ఫార్మర్‌గా ఎంచుకోవడంతో ఆమెను జైల్లో వేశారు.
షణ్ముఖ్, సిరిలు ఒకే బాటలో పయనిస్తూ విశ్వ ముఖంపై నీళ్లు కొట్టారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నీపై శ్రీరామ్ నీళ్లు చల్లుతాడని అందరూ అనుకున్నారు. సన్నీ కూడా అదే అనుకున్నాడు. కానీ, అందుకు భిన్నంగా శ్రీరామ్.. కాజల్ ముఖంపై నీళ్లు కొట్టాడు. కాజల్‌పై ఉన్న కోపాన్ని అనీ మాస్టర్ తనపై చూపించుకుని, తన ముఖంపై తానే నీళ్లు కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
శ్వేత, హమీద, శ్రీరామ్, అనీ మాస్టర్, రవి, లోబో, విశ్వలు కాజల్‌ను నామినేట్ చేయడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్ సెంచరీ మ్యాట్రసిస్ టాస్క్ నిర్వహించాడు. పరుపుపై ఎవరు ఎక్కువ సేపు ప్లాంక్ వేస్తారో వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించాడు. నామినేషన్స్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఈ వీకెండ్ షో చూడాల్సిందే.