బ్రేకింగ్ న్యూస్- మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు

Maharashtra minister sensational allegations

0
83

ముంబయిలో సంచలనం సృష్టించిన క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్ కేసు చుట్టూ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు.

క్రూయిజ్‌ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్​సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్​ గుర్తు చేశారు. కానీ, వారిలో 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు.

రిషభ్‌ సత్యదేవ్, ప్రతిక్‌ గాబా, అమిర్‌ ఫర్నిచర్‌వాలాను ఓ భాజపా నాయకుడితో మాట్లాడిన అనంతరం ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని మంత్రి ఆరోపించారు. ఆ ముగ్గురిని ఎవరి ఆదేశాల మేరకు డ్రగ్స్‌ కేసు నుంచి తప్పించారో ఎన్​సీబీ తెలపాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ కూడా రాసినట్లు ఆయన పేర్కొన్నారు.