Big Breaking: ‘మా’ సభ్యత్వంపై ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం

Prakash Raj resigns from our membership

0
122

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్‌రాజ్‌పై 107 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌పై శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయాన్ని అందుకున్నారు. ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. జాయింట్‌ సెక్రటరీలుగా ఉత్తేజ్‌, గౌతమ్‌రాజు గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌తో పాటు ఈసీ కమిటీ విజేతలను నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సందర్బంగా సోమవారం ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..మా సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాతో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉంది. మా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా తప్పు కాదు. నా తల్లిదండ్రుల తప్పు కాదు. నేను నాన్ లోకల్ అన్న రఘుబాబు, కోటా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా. విష్ణు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.