మహారాష్ట్రలో బంద్..నిలిచిపోయిన కార్యకలాపాలు

Bandh in Maharashtra

0
96

యూపీలో రైతులపై జరిగిన దాడికి నిరసనగా నేడు మహారాష్ట్రలో బంద్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ బంద్ కు పిలునిచ్చింది. రైతులకు మద్దతుగా బంద్‌ పాటించాలని నిర్ణయించింది. ఆస్పత్రులు లాంటి అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేసి బంద్ ను కొనసాగిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు బస్సులను ధ్వంసం చేశారు. దీనితో బృహన్ ముంబై కార్పొరేషన్ బస్సు సర్వీసులను రద్దు చేసింది.