జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందని, చివరికి జనసేన కార్యాలయ నిర్మాణం కూడా ఇసుక లేకపోవడం వల్ల నిలిచిపోయిందని తెలిపారు. అంతేగాకుండా, ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ తమతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే తాము ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకోవడంతో వారితో పొత్తు పెట్టుకోలేదని వివరించారు.