ఐఫోన్ ఆర్డర్ ఇస్తే..’నిర్మా’ సబ్బులొచ్చాయ్..!

0
77

ఐఫోన్ కొనడం చాలా మంది మధ్య తరగతి వ్యక్తులకు ఓ కల. అలాంటిది ఖరీదైన యాపిల్ ఫోన్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ ఇస్తే..తీరా అది వచ్చాక అందులో ఐఫోన్​ లేకపోతే..? ఇలాంటి అనుభవమే సిమ్రన్​పాల్ సింగ్​ అనే వ్యక్తికి ఎదురైంది.

బిగ్ బిలియన్ డేస్ ఆఫర్​లో భాగంగా రూ.53 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్​ 12ను ఫ్లిప్​కార్ట్​లో ఆర్డర్ చేశారు సిమ్రన్​పాల్. కానీ తీరా వచ్చాక చూస్తే అందులో ఐఫోన్ లేదు. పార్సిల్​లో రెండు నిర్మా సబ్బులు వచ్చాయి. యూట్యూబ్​లో వీడియో అప్​లోడ్ చేసి తన అనుభవాన్ని వివరించారు సిమ్రన్​పాల్.

దీనిపై ఫ్లిప్​కార్ట్ కస్టమర్ కేర్​ను సంప్రదించగా..కొన్ని రోజుల తర్వాత సిమ్రన్​పాల్ ఆర్డర్​ను సంస్థ రద్దు చేసింది. పొరపాటు వల్ల అలా జరిగిందని గుర్తించింది. ఆర్డర్​ను రద్దు చేసి ఐఫోన్​ కోసం చెల్లించిన నగదును కస్టమర్​కు రీఫండ్ చేసింది.