భారీగా పెరిగిన పసిడి ధర- తెలంగాణ, ఏపీలో రేట్లు ఇలా..

Gold prices rise sharply in Telangana, AP

0
85

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు. అన్నీ సూచీలు డౌన్ లో ఉన్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్​లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 280 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 48,630గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,272 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,530 ఉండగా..కేజీ వెండి ధర కిలోకు రూ. 63,272 పలుకుతోంది.