అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, డిసెంబర్ 17న ‘పుష్ప: ది రైజ్’ విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుండి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది. దాక్కో దాక్కో మేక పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ‘చూపే బంగారమయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వదిలారు.
ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు.రేపు ఉదయం ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=sf4ICWFojUA