Flash- మంచు విష్ణు ప్రమాణస్వీకారం..ఆ ఫైల్ పై తొలి సంతకం

Manchu Vishnu swearing in..the first signature on that file

0
65

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ‘మా’ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.  ‘మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష్ణు..ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

https://twitter.com/iVishnuManchu