దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఉత్రా’ హత్య కేసు నిందితుడైన సూరజ్‌కు రెండు జీవిత ఖైదులు విధించింది కోర్టు. తన భార్య ఉత్రాను చంపడానికి విషపూరిత పామును ఉపయోగించిన కేసులో సూరజ్‌ను ఇటీవల దోషిగా తేల్చిన కోర్టు..తాజాగా తీర్పును వెలువరించింది.
ఈ కేసు తీర్పు సందర్భంగా..అత్యంత అరుదైన ఘటనల్లో ఇది ఒకటని కొల్లం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.మనోజ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో తన క్లయింట్‌ను ఇరికించారని సూరజ్ తరఫున న్యాయవాది వాదించారు. ఉత్రా మరణం సహజమైన పాము కాటుతోనే జరిగిందన్నారు.
కేరళలోని జిల్లా కోర్టు అతనికి రెండు జీవిత ఖైదులు విధించింది. దీనితో పాటు రూ.5.85 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించనట్లయితే అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాముతో కాటు వేయించినట్లు నిర్ధారణ కావడంతో ఈ కీలక తీర్పునిచ్చింది కొల్లాం జిల్లా కోర్టు. ఈ కేసులో అక్టోబర్ 11న విచారణ ముగించిన కోర్టు..తాజాగా శిక్షను ఖరారు చేసింది.