Flash- పుల్వామాలో ఎన్​కౌంటర్..టాప్ కమాండర్ హతం

Encounter in Pulwama..Jaishe top commander killed

0
81

జమ్ముకశ్మీర్​ పుల్వామా​ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్​ షామ్​ సోఫీని బలగాలు మట్టుబెట్టాయి. ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా..భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ మేరకు కశ్మీర్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్​ పోలీస్(ఐజీపీ)​ విజయ్ కుమార్​ తెలిపారు. ముష్కరులకు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.