తెలుగు రాష్ట్రాలపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నక్సలైట్లతో పోల్చిన ఆయన.. తెలంగాణ, ఏపీకి లింకులు పెట్టారు. నక్సలైట్ల నాయకులు తెలంగాణ, ఏపీలో ఉంటే..ఆర్ఎస్ఎస్ నేతలు నాగపూర్ లో ఉన్నారని అన్నారు.
వారి ఆదేశాల ప్రకారమే ఛత్తీస్ గఢ్ లో అరాచకాలకు పాల్పడుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ, ఏపీల్లోని నక్సలైట్ నాయకులు ఇచ్చే ఆదేశాలతో..ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అకృత్యాలకు తెగబడినట్టే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలూ పాలనకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఏపీల్లో నక్సల్ నాయకులున్నారని, ఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.