ఇంత ఘోరమా..తల్లిని, చెల్లిని చంపిన అన్న

0
91

మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న కారణంతో తల్లి, సోదరిపై కాల్పులు జరిపి, హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.

మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా అధికారులు గుర్తించారు. “పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.

బుధవారం రాత్రి సాంబార్ విషయంలో తల్లి, సోదరితో అతడు ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు..నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు” అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.