దీపావళికి RRR టీజర్ ట్రీట్?

RRR Teaser Treat for Diwali?

0
119

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అత్యంత భారీగా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన తారక్, చెర్రీ టీజర్స్, దోస్తీ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రచారంలో భాగంగా..మరో ట్రీట్ ను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట జక్క,న్న అండ్ టీమ్. ఇప్పటి వరకూ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి సంబంధించి హీరోల ఇండివిడ్యువల్ టీజర్స్ మాత్రమే విడుదలయ్యాయి. అయితే ఈ సారి ఈ ఇద్దరూ కలిసున్న ఓ బ్రహ్మాండమైన టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఈ టీజర్ దీపావళి కానకగా విడుదల చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి ఎన్టీఆర్, తారక్ మోటార్ సైకిల్ మీద విహరించే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.  మరి దీపావళి నాడు రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్’ టీజర్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.