దారుణ హత్య..అర్ధనగ్నంగా మృతదేహం

Brutal murder at a farmers' camp.. half-dead body

0
81

రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు దుండగులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అన్నదాతల నిరసనల ప్రధాన వేదికకు దగ్గరలో ఈ మృతదేహం వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. ‘పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఒక చేతిని మణికట్టు వరకు నరికేశారు’ అని పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఆ వ్యక్తి ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశాడని కొందరు ఆరోపించారు. అయితే ఇది అధికారికంగా నిర్ధరణ కావాల్సి ఉంది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకిస్తూ..దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు గత నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిరసనలు ఒక్కోసారి హింసాత్మకం అవుతున్నాయి. అక్టోబర్ 3న ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేస్తున్న వారిపై వాహనాలను నడిపిన ఘటనలో రైతులు సహా.. ఎనిమిది మంది మరణించారు. ఇప్పుడు ఈ ఘటనతో రైతులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.