‘రిలయన్స్’ మరో ఘనత..భారత్​ నుంచి ఫస్ట్​

'Reliance' is another credit..first from India

0
97

భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ మరో ఘనత సాధించింది. ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ‘ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యాలు (వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌) ర్యాంకింగ్స్- 2021లో భారతీయ కార్పొరేట్‌ సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో మొత్తం 750 సంస్థలు ఉండగా, రిలయన్స్ 52వ ర్యాంకు సంపాదించింది. వంద ర్యాంకు లోపల భారత్‌ నుంచి మరో మూడు కంపెనీలు.. ఐసీఐసీఐ బ్యాంకు(65), హెచ్‌డీఎఫ్‌సీ(77), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(90) నిలిచాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, అల్ఫాబెట్‌, డెల్‌ తరువాతి స్థానాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన హువాయి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఎస్బీఐ 119, ఎల్‌ అండ్‌ టీ 127, బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 254, ఇండియన్ బ్యాంక్ 314, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) 404, అమరరాజా గ్రూప్ 405, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూప్‌ 746 స్థానాల్లో ఉన్నాయి.