మీ ఫోన్​లో వైరస్​ ఉందని తెలుసుకోండి ఇలా..

Find out if your phone has a virus.

0
102

స్మార్ట్​ఫోన్​ అంటే ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు లాకర్​ లాంటిది. అందులో వైరస్​ చేరడం అంటే ఇంట్లో దొంగలు పడటమే. తీరని నష్టం కలిగిస్తుంది. మీ స్మార్ట్​ఫోన్​కు వైరస్​ సోకిందని అనుమానంగా ఉంటే..కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమే. అయితే మీ స్మార్ట్​ఫోన్​లో మాల్​వేర్​ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎలానో చూడండి.

కరోనా మహమ్మారి అనంతరం మన జీవితాల్లో స్మార్ట్​ఫోన్​ల పాత్ర మరింత కీలకంగా, క్రియాశీలకంగా మారింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో వాయిస్​, వీడియో, మెసేజ్​ల రూపంలో సందేశాలను పంపించుకోగలం. ఇంట్లోనే ఉండి ఆఫీస్​ పని, షాపింగ్ చేసుకోవచ్చు. ఎంటర్​టైన్​మెంట్ పొందగలం. కాబట్టి ఫోన్​లో వైరస్​ సమస్య  ఉంటే వెంటనే పరిష్కారం కోసం చూడాలి. లేదంటే తీరని నష్టం తప్పదు.

వైరస్​, మాల్​వేర్​ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రూల్స్​ను పాటించాలి. యాప్​ స్టోర్​ లేదా గూగుల్​ ప్లే స్టోర్​ వంటి విశ్వసనీయ సోర్సెస్​ నుంచే నమ్మదగిన యాప్​లను మాత్రమే డౌన్​లోడ్ చేయాలి. ఏదైనా యాప్​ను డౌన్​లోడ్​ చేసే ముందు యూజర్​ రివ్యూలను చదవాలి. ఆయా యాప్​లు అడిగే అనుమతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అత్యుత్తమ విధానాలు పాటించినా..వైరస్​ లేదా మాల్​వేర్​ మీ స్మార్ట్​ఫోన్​లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఫోన్​లో వైరస్​ ఉందని ఇలా తెలుసుకోవచ్చు..

మీ ఫోన్​లో ఊహించని ఛార్జీలు కట్ అవుతున్నాయంటే వైరస్​ సోకినట్లే లెక్క.

ప్రీమియం టెక్స్ట్​ మెసేజ్​లు, ఫోన్​ కాల్స్​ చేయడం, యూప్​లో కొనుగోళ్ల ద్వారా హానికర యాప్​లు ఆర్జిస్తాయి.

భరించలేని యాడ్​లు దర్శనమిస్తుంటే స్మార్ట్​ఫోన్​ యాడ్​వేర్​ బారినపడిందని అర్థం చేసుకోవచ్చు.

క్రమంగా స్మార్ట్​ఫోన్​ పెర్​ఫార్మమెన్స్​ తగ్గిపోవడం.

బ్యాటరీ సామర్థ్యం, పనితీరు పడిపోవడం