టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. అదీ తన కొత్త సినిమా అప్డేట్ అంటే అభిమానుల ఆనందమే వేరు కదా. ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. ఈనెల 9 న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మైక్రో టీజర్ విడుదల చేయనుంది చిత్ర బృందం. దాంతోపాటే మహేష్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
ఈ డబుల్ ట్రీట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అంశమే. మహేష్ తన కొత్త సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు , ఇటీవలే కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా ప్రెసెంట్ యూత్ హార్ట్ త్రోబ్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో ఏళ్ల తరువాత ఈ చిత్రం ద్వారా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తూ రీఎంట్రీ ఇస్తోంది. ఆగస్టు 9 న మహేష్ పుట్టినరోజు కాబట్టి ఆరోజు ఫ్యాన్స్ కు ఈ రెండు గిఫ్ట్స్ వారికి పండగే!