మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ..ఆందోళనలో అభిమానులు

Megastar Chiranjeevi undergoes surgery

0
84

అగ్ర కథానాయకుడు చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండటం వల్ల అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చేతికి ఏమైనా గాయమైందేమోనని ఆయనను అడగ్గా, తన అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని చెప్పారు.

కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా ఉండటం వల్ల వైద్యులను కలిసినట్లు చిరు వెల్లడించారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్‌ మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు.

సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చినట్లు వెల్లడించారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు అభిమానులకు తెలిపారు. త్వరలోనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.