రేపు సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా సెలవును ప్రకటించింది. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో సూచన మేరకు బుధవారానికి బదులుగా మంగళవారాన్ని సెలవుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీని జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మూడో నెల రబీ అల్ అవ్వల్ లో పౌర్ణమి ముందురోజు మహమ్మద్ ప్రవక్త జన్మించారు. మానవులంతా ఒకటేనని, ప్రజల మధ్య తారతమ్యాలు లేవని ఆయన బోధించారు. శాంతి, దైవభీతి, దానగుణంతో ప్రజలు మెలగాలని సూచించారు