ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ సర్‌ప్రైజ్‌..ట్రైలర్‌ అదుర్స్!

Prabhas ‘Romantic’ Surprise..Trailer Adurs!

0
85

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతికా శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ట్రైలర్ టైటిల్‌కి తగ్గట్టుగా రొమాంటిక్‌ సన్నివేశాలతో యువతని మెప్పించేలా ఉంది. ఆకాశ్‌ తన నటనలో పరిణితి చూపించారు. తొలి పరిచయంలోనే కేతిక అందరినీ కట్టిపడేసేలా ఉంది. నేపథ్యం సంగీతం బాగుంది. ఈ ప్రేమకథా చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=KsZAJzsxbhE