వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. 40 శాతం టికెట్లు మహిళలకే ఇవ్వనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో మహిళలు పూర్తి స్థాయి భాగస్వామి కావాలని మేం కోరుకుంటున్నాం. మహిళల సాధికారత కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రాజకీయ ఉద్దేశం, ఇతర అజెండాలు ఏమీ లేవని ఆమె పేర్కొన్నారు.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 312 స్థానాలు గెల్చుకొని..యూపీలో భాజపా అధికారంలోకి వచ్చింది. సమాజ్వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ పార్టీ 19 చోట్ల గెలవగా..కాంగ్రెస్ మాత్రం 7 స్థానాలకే పరిమితమైంది. యూపీ శాసనసభలో మొత్తం 403 స్థానాలున్నాయి.