Breaking: హనుమకొండలో దారుణం..చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

Atrocities in Hanumakonda .. An old man kills a 13 year old child

0
99

తెలంగాణ: అభం, శుభం తెలియని చిన్నారి మీద ఓ వృద్దుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. వావి వరసలు మరిచి, వయసు తేడాలు మరిచి తన మనవరాలి వయసున్న చిన్నారిని వంకరబుద్దితో చూశాడు.  హనుమకొండ జిల్లాలో ఓ వృద్ధుడు చేసిన ఈ ఘాతుకం కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..పరిమిళ కాలనీ రోడ్ నెంబర్ 8లోని ఓ ఇంట్లో 13 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల పైబడిన భిక్షపతి అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి అత్యాచారం చేశాడని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులను సంప్రదించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.