ఏపీలో టీడీపీ వెర్సస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. ఆంధ్రాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అనంతరం టీడీపీ కార్యలయాలపై కొందరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలను అల్లకల్లోలం చేస్తున్న టీడీపీని నిషేధించాలన్నారు. ఈమావోయిస్టు పార్టీకి, టీడీపీకి తేడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలా టీడీపీని కూడా నిషేధించాలని ఎలక్షన్ కమిషన్ ని కోరుతామన్నారు. ఒక ప్రజాధారణ కలిగి ఉన్న ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడుతారా అంటూ ఫైరయ్యారు. అలాంటి వారిని చంద్రబాబు సమర్ధించడం దారుణమన్నారు.
పవన్, చంద్రబాబు కలిసి ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని బొత్స ఆరోపించారు. బీజేపీ సోము వీర్రాజు కూడా టీడీపీ నేతల భాషని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని.. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.