కింగ్ నాగ్ హోస్టింగ్ కు. టీఆర్పీ రేటింగ్స్ సలామ్!

కింగ్ నాగ్ హోస్టింగ్ కు. టీఆర్పీ రేటింగ్స్ సలామ్!

0
93

అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌3’. ఈ షో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన టైమింగ్‌, పంచ్‌ డైలాగ్‌లతో మెప్పిస్తున్నారు. కాగా, తొలి వారం అత్యధికమంది ఈ షోను చూడటానికి ఆసక్తి చూపినట్లు ‘స్టార్‌ మా’ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రేటింగ్స్‌ వివరాలను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు.

సుమారు 4.5 కోట్లమంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు చూసేందుకు మొగ్గు చూపారట. మొదటివారం టీవీ వీక్షకుల్లో దాదాపు 60శాతం మంది బిగ్‌బాస్‌3ని వీక్షించారట. bigbosstelugu3 ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉండగా, మిలియన్‌కు పైగా ఎంగేజ్‌మెంట్లు వచ్చాయట. ఈ సందర్భంగా నాగార్జున ‘బిగ్‌బాస్‌3’ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలివారం నటి హేమ ఎలిమినేట్‌ కాగా, ఆ వెంటనే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సంగతి విదితమే.