మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలుపడం కోసం గత ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పోలీసులు చేపట్టిన పూనా నర్కోమ్ ( స్థానిక గోండు భాషలో కొత్త డాన్ అని అర్థం) క్యాంపెయిన్ బాగానే పని చేస్తుంది. ఈ క్యాంపెయిన్‌తో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
తాజాగా ఇవాళ కూడా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. వాళ్లలో తొమ్మది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా అనేక కేసుల్లో నిందితులని, మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పని చేసేవారని, వీరిలో ఒక మావోయిస్ట్ పై లక్ష రూపాయలవరకు రివార్డు ఉందని మిగతా వారి అందరిపై ఒక్కొక్కరికి 10 వేల రివార్డు ఉందని తెలిపారు.
వీరంతా కుకనార్ గాడిరాస్, పుల్బాజీ, చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలలోని గ్రామాలకు చెందినవారని ఎస్పీ సునీల్ దత్ శర్మ తెలిపారు. ఇప్పటివరకు లొంగిపోయిన మొత్తం మావోయిస్టుల సంఖ్య 176కు చేరిందని ఆయన తెలిపారు.