నిన్న బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రగడే జరిగింది. నిన్న జరిగిన డైమండ్ టాస్క్ లో గెలిచిన అలీ రెజా, మగవారంతా ఆడవారిగా సిద్ధం కావాలని ఆదేశించిన వేళ, ఈ టాస్క్ తమకు వద్దని జాఫర్, వరుణ్ సందేశ్, వితికా షేరు, తమన్నాలు చెప్పేశారు. వారంతా పక్కన కూర్చుని ఉండగా, వాదోపవాదాలు పెరిగి తీవ్ర వ్యాఖ్యల వరకూ వెళ్లాయి. అలీ రెజాను ఉద్దేశించి తొలుత ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి, తనేమీ మెగాస్టార్, సూపర్ స్టార్ ను కాదనీ, బాడీ ఉన్నంత మాత్రాన సూపర్ స్టార్ కాలేరని అంది. అలీ రెజాను గెలవనివ్వబోనని, అడ్డుకుంటానని హెచ్చరించింది.
ఇక ఆషూరెడ్డిని మరింత ఘాటుగా విమర్శిస్తూ, అందంగా ఉన్నావని అంటూనే చివాట్లు పెట్టింది. ఆషూకు సిగ్గు శరం లేదని మండిపడింది. అలీ రెజా పక్కన ఎంత బాగా కూర్చుంటావంటూ మాట్లాడింది. ఏం సంబంధముందని ప్రశ్నించింది. దీంతో మిగతా కంటెస్టెంట్లు సైతం తమన్నా తీరును తప్పుబట్టారు. ఆపై జాఫర్ వద్దకెళ్లిన తమన్నా, అలీ రెజా విలన్ అని, తానే హీరోయిన్ అని వ్యాఖ్యానించింది.