స్యూరుడు అస్తమించని ప్రాంతాలు..ఎప్పటికీ చీకటి ఉండని దేశాలు ఇవే..!

Areas where the sun never sets..these are the countries where there will never be darkness ..!

0
122

ఈ భూమిపై రాత్రి, పగలు నిరంతరం ఉంటాయి. మన దేశంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఇది అందరికి తెలిసిన విషయమే. సూర్యోదయం, సూర్యాస్తమయం ద్వారా మనం జీవనం కొనసాగిస్తున్నాం. కానీ కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అవును మీరు చదివింది నిజమే. ఈ ప్రపంచమే ఎన్నో అద్భుతాలకు, వింతలకు నిలయం. మనకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడూ ఇలా  ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మరి సూర్యుడు అస్తమించని ప్రాంతాలేవి? దానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నార్వే

సూర్యుడు అస్తమించని ప్రదేశాల్లో ప్రధానంగా నార్వే ఒకటి. అందుకే దీనిని సూర్యుని భూమి అంటారు. మన దేశంలో సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి పడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మే నుండి జూలై వరకు వేసవి నెలల్లో అసలు సూర్యుడు అస్తమించడు. ఎప్పుడూ ఉదయించి ఉండే సూర్యున్ని చూడాలంటే నార్వే యొక్క ఉత్తర ప్రాంతాలను సందర్శించాల్సిందే.

ఐస్లాండ్

రాత్రి కూడా సూర్యుడు ఉదయించడాన్ని మనం  ఐస్లాండ్ లో చూడొచ్చు. ఇక ఇక్కడ సూర్యుడు జూన్‌లో అసలు  అస్తమించడు. అంతేకాదండోయ్ ఇక్కడ ఒక్క దోమ కనిపించదట.

ఫిన్లాండ్

అందమైన సరస్సులు ద్వీపాలు ఉన్న దేశాలలో ఫిన్లాండ్ ఒకటి. ఆగస్టు నెలలో ఇక్కడ సూర్యాస్తమయం ఉండదు.  కానీ రాత్రి సమయంలో సూర్యుడు ప్రకాశిస్తాడు.  ఇది కేవలం వేసవిలో సందర్శించే వారికే సాధ్యపడుతుంది. అర్ధరాత్రి 12 గంటలూ అయినప్పటికీ ప్రజలు ఇక్కడ వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై కనిపిస్తుంటారట.

నునావుట్ 

కెనడాలోని నునావుట్ లో కేవలం మూడు వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. సంవత్సరంలో దాదాపు రెండు నెలలు ఈ నగరంలో సూర్యకాంతి ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా 30 రోజులు చీకటిగా ఉంటుంది. ఈ నగరం ఆర్కిటిక్ సర్కిల్ పైన రెండు డిగ్రీల దూరంలో ఉండడమే దీనికి కారణం.

బారో 

బారో ప్రాంతం అలస్కాలో ఉంది. ఇక్కడ మే చివరి నుండి జూలై చివరి వరకు రాత్రి ఉండదు. కొన్ని నెలల తర్వాత ఈ సమయం పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే నవంబర్ ప్రారంభం నుండి వచ్చే 30 రోజులకు అసలు రోజు అనేదే ఉండదు. ఈ ప్రక్రియను పోలార్ నైట్స్ అంటారు.

స్వీడన్ 

స్వీడన్ దేశంలో రాత్రి 12 గంటల వరకు సూర్యుడు ఉదయించి ఉంటాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు అస్తమిస్తాడు. సంవత్సరంలో ఆరు నెలలు ఉదయం ఉండే దేశం ఇది.  ఇక్కడ మీరు అర్ధరాత్రి సూర్యున్ని ఆస్వాదించవచ్చు.