షాక్- పత్తి చేను మధ్యలో పాడు పని..అడ్డంగా దొరికారు ఇలా..

Shock- Damage work in the middle of the cotton stalk.

0
86

గంజాయి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చ లేపుతుండగా..తెలంగాణలో కూడా పలు డ్రగ్స్ లింకులు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. ఎస్‌ఈబీ అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. పత్తి చేను మాటున గుట్టుగా చేస్తున్న గంజాయి సాగు వ్యవహారం వెలుగుచూసింది. ఊహించని విధంగా పత్తి చేలో గంజాయి సాగు స్థానికులను షాక్‌కు గురిచేసింది. గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. చెంచమ్మ అనే మహిళ గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.

చెంచమ్మ పొలంలో నాటిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో లింకులు ఉన్నాయో కూపీ లాగుతున్నారు. అసలు ఇలా గంజాయి సాగు చెయ్యమని ఎవరు చెప్పారు. గతంలో ఎన్నిసార్లు ఇలా చేశారు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. సాగు చేసిన గంజాయిని ఎవరికి సప్లై చేస్తున్నారనే విషయంపై ఫోకప్ పెట్టారు.