అల్లు అర్జున్ సుకుమార్ కథ ఇదేనా…?

అల్లు అర్జున్ సుకుమార్ కథ ఇదేనా...?

0
92

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఆర్య సినిమా బ్లాక్ బ్లస్టర్ కాగా ఆర్య 2 సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ సినిమా అక్టోబర్ నెల నుండి షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కానప్పటికీ ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతుందని, ఎర్రచందనం స్మగ్లర్లకు హీరో ఎలా బుధ్ధి చెప్పాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందించారని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నిజానికి ఈ కథలో మహేశ్ బాబు హీరోగా నటించాలి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన తరువాత సుకుమార్ మహేశ్ బాబుతో సినిమా తీయాలని మహేశ్ బాబుకు ఈ కథ చెప్పి ఒప్పించాడు. కానీ కొన్ని కారణాల వలన మహేశ్ ఈ సినిమాలో నటించకపోవటంతో ఇదే కథతో సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా తీయబోతున్నాడు.