మా ఎన్నికల్లో అక్రమాలు సాక్ష్యాలతో బయటపెట్టిన ప్రకాశ్ రాజ్

Prakash Raj exposes irregularities in our elections

0
122

‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది.

తాజాగా మా ఎన్నిక‌ల్లో వైసీపీ జోక్యం ఉందంటూ న‌టుడు ప్రకాశ్‌రాజ్ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు ప్ర‌కాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల హాల్‌లో వైసీపీకి చెందిన ఓ వ్య‌క్తి ఉన్నాడ‌ని.. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని.. జగ్గయ్యపేటకు చెందిన వాడన్నారు.

అత‌డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. అంతేకాదు ఏపీ సీఎం జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఆయ‌న బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిన ఓట‌ర్లు విష్ణు ప్యాన‌ల్‌కి ఓట్లు వేశార‌ని చెప్పారు.

https://twitter.com/prakashraaj