లక్షణమైన భార్యను ఓ భర్త రూ.లక్షకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 2 నెలల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఫేస్ బుక్‌లో పరిచయం కాగా..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
కొన్నిరోజుల తర్వాత భర్త సరోజ్ రాణా ఉపాధి కోసం రేవతిని తీసుకొని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్నాళ్ల తర్వాత భర్త సరోజ్‌రాణా రాజస్థాన్‌లోని ఓ కుటుంబానికి భార్య రేవతిని రూ.లక్షకు అమ్మేసి సొంత గ్రామానికి తిరిగి వచ్చేశాడు.
భార్యను అమ్మేయగా వచ్చిన ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు. అతి కష్టం మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తనను అమ్మిన విషయం తెలియదని, ఇంట్లో పని చేయాలంటూ పంపించాడని రేవతి చెప్పుకొచ్చింది.